టిడిపిలోకి జగ్గారెడ్డి..!!

 

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి త్వరలో 'సైకిల్' ఎక్కబోతున్నట్లు రాజకీయవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైన గెలవాలని పట్టుదలతో వున్న జగ్గారెడ్డి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీలో వుంటే గెలవడం కష్టమేనని ఆయన అనుకుంటున్నారట. 2019 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొగల పార్టీపై ఆయన్ దృష్టి సారించారట. దానికి టిడిపి పార్టీ అయితెనే బెటర్ అని ఆయన భావిస్తున్నారట.


మరోవైపు తెలంగాణలో టీడీపీకి తిరిగి పునర్వైభవం తేవాలని భావిస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు, తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గంపై కన్నేశారట. ఈ వర్గం వారిని టిడిపిలోకి చేర్చుకుంటే మంచి ఫలితాలు సాధించగలమని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఆయన సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డి కూడా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆహ్వానం పలికితే టీడీపీలో చేరేందుకు సిద్ధమేనని ఆ పార్టీ నేతలకు సంకేతలిచ్చారట. దీంతో ఆయన సైకిలేక్కడం ఖాయమని తెలుస్తోంది.     ఇంకా తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కొంతమంది టిడిపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని రాజకీయవర్గాల సమాచారం.