ప్రీతీ జింటా: నెస్ వాడియా శాడిజం గుట్టు ఇదే!

 

తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను గతంలో ఎన్నోసార్లు శారీరకంగా దారుణంగా హింసించాడని బాలీవుడ్ నటి ప్రీతీజింటా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసు కమిషనర్‌కి రాసిన లేఖలో నెస్ వాడియా తనను ఎలా హింసించాడో ప్రీతీ జింటా వివరంగా రాసింది!

 

1. నెస్ వాడియా చాలా దుర్మార్గుడు. నన్ను శారీరకంగా చాలా హింసించేవాడు. నేను అతన్ని చాలా ఇష్టపడుతున్నానని తెలిసినా నన్ను హింసించేవాడు. సిగరెట్లతో నా ముఖాన్ని కాల్చేవాడు.

 

2. నెస్ వాడియా బయటి ప్రపంచానికి ఎంతో సౌమ్యుడిలా కనిపిస్తాడు. అతని నిజ స్వరూపం అతనితో ఏకాంతాన్ని పంచుకున్న నాకే తెలుసు. చాలాసార్లు అతను చాలా భయంకరంగా, శాడిస్టులా ప్రవర్తించేవాడు.

 

3. చాలాసార్లు అతను నన్ను హింసించే సమయంలో అతని ముఖంలోని క్రూరత్వాన్ని చూసి నేనెంతో భయపడిపోయేదాన్ని. అతను నన్ను చంపేస్తాడేమోనన్న అనుమానం నాకు ఏర్పడింది.

 

4. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అతను నా చెయ్యి లాగి దూషించిన విషయం చాలా చిన్నది. అంతకు మించిన శాడిజం అతనిలో నేను చూశాను. అతని ఆగడాలు భరించలేక, ప్రశాంతంగా వుండాలన్న ఉద్దేశంతోనే అతన్ని నేను దూరంగా పెట్టాను.

 

5. అతన్ని దూరంగా పెట్టకపోతే అతను ఏదో ఒకరోజు నన్ను కచ్చితంగా చంపేస్తాడు. ఆ విషయం నాకు అర్థమైపోయింది.

 

6. నెస్ వాడియా భవిష్యత్తులో కూడా నాకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ హాని చేస్తాడన్న భయం నాకు వుంది.

 

7. నేను నెస్ వాడియా మీద పోలీసులకు ఫిర్యాదు ఇస్తోంది అతనికి హాని చేద్దామన్న ఉద్దేశంతో కాదు.. నన్ను నేను రక్షించుకోవాలన్న భయంతో.