బిగ్‌బాస్ కోసం భారీ ఆఫర్... 5 కోట్లు!

 

టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో సెలబ్రిటీలు ఒక ఇంటిలో కొంతకాలం బయటి ప్రపంచాన్ని చూడకుండా నివసిస్తారు. వారి ప్రవర్తన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డవుతూ వుంటుంది. కాలం గడిచేకొద్దీ సెలబ్రిటీల ఎమోషన్లు బయటపడుతూ వుంటాయి. ఆ ఫుటేజ్‌తో టీవీ ఎపిసోడ్స్ రూపొందిస్తారు. ఈ కార్యక్రమం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌కు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ ఆఫర్ ఇవ్వజూపినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ బంపర్ ఆఫర్‌లో భాగంగా ఆయనకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు రియాలిటీ షో నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే. స్వతహాగా మంచి కవి అయిన కుమార్ విస్వాస్ ఆతర్వాత రాజకీయ నేతగా మారారు. దీనిమీద విస్వాస్ సన్నిహితులు స్పందిస్తూ.. బిగ్‌బాస్ ఆఫర్ వాస్తవమేనని చెప్పారు. అయితే తాను పాల్గొంటున్నదీ లేనిదీ మాత్రం విశ్వాస్ ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.