త్వరలో  జగనన్నతో చెప్పుకుందాం..!

ప్రజలను ఆకట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నానాతంటాలు పడుతున్నారు. ప్రజోపయోగ పనులుచేసి వారి మనసులు గెలుచుకోవాలసిన నాయకుడు మూడేళ్లు దాటినా ప్రజల నుంచి నిర సనలు, ఛీత్కారాలేఎదుర్కొంటున్నారు. ప్రజలు విసిగెత్తి ఈయన దిగిపోతే బావుణ్ణనే అనుకుం టున్నారు. కానీ చిత్రంగా సీఎం జగన్ మాత్రం చిరునవ్వుతో ఇంకా ప్రజల్ని తన వేపు ఆకట్టకునే మార్గాల అన్వేషణలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తాజాగా మెరుపు లాంటి ఆలోచన తట్టింది. దాని పేరు జగనన్నకు చెబుతాం.. త్వరలో ప్రారంభిస్తారని ఆయన కార్యాలయం ప్రకటించింది. నిజానికి ఈ కార్యక్రమం నవంబర్ 2న ఆరంభించాలి. కానీ మౌలిక సదుపాయాల కల్పనలో రవ్వంత జాప్యం కారణంగా వెనుకబడిందని అధికారులు చెబుతున్నారు. 

జగన్కు హఠాత్తుగా వచ్చిన ఆలోచన ఆయనకు కొత్తేమోగాని ప్రజలకు కొత్తకాదు. జనవాణి వంటి కార్యక్రమమే ఇది. గతంలో చంద్రబాబానాయుడు ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడా నికి అప్పట్లో ఒక కార్యక్రమం అమలు చేశారు. దానికి ప్రత్యేకంగా 1100 అనే ఫోన్ నంబర్ కూడా ఉండేది. ప్రజలు తమ సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడానికి ఎంతో వీలుండేది. దాన్ని ప్రజలంతా మరీ అవసరమయి నపుడు వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాలవారూ ప్రశం సించిన కార్యక్రమం. ఇప్పుడు జగనన్న అదే పంధాను అనుస రించడానికి జగన న్నకు చెబుతామని పేరు కొత్తగా పెట్టుకున్నారంతే.  వాస్తవానికి దీనికి మరో స్పూర్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరంభించిన దీదీ కో బోలో.  అంచేత కాపీ నుంచీ మరో కాపీ అంటే పెద్ద జిరాక్స్. 

అయితే ఈ జిరాక్స్ కూడా వీలయినంత ఆలస్యమే చేశారనాలి. పాలనాపరంగా ప్రజల నుంచి వ్యతి రేకత, విముఖత రావడం, తనకు కుర్చీ మిగిలే అవకాశం పోయే పరిస్థితులు ఏర్పడిన తర్వాతనే దీన్ని ఆరంభించడం చిత్రం. ఎవరన్నా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అధికారంలోకి రాగానే విపక్షాల మీద విరుచుకుపడటం మానేసి ఇలాంటి కార్యక్రమం అమలు చేసి ఉంటే ప్రజల నుంచి సూచనలు సలహాలు కోకొల్లలే వచ్చేవి. కానీ అప్పట్లో సీఎం జగన్ స్పందన కార్యక్రమం పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు.  ఏమయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో జగనన్నా నాకు ఎంతో కష్టమొచ్చిందని ఏ ప్రాంతం వారు తమ ఆర్తిని వెళ్లగక్కుకుంటారో చూడాలి. ఎందుకంటే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ నాయ కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు జల్లెడ పట్టినట్టు తమ పాలన గురించి అభిప్రాయ సేకరణకు, తమ నాయకుడిని భజన చేయాలని చెప్పడానికి తిరిగి తిరిగి వేసారి రాజ నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు అర్జంట్ గా ఈ బ్రహ్మాస్త్రంతో వచ్చి పడే లబ్ధి మాత్రం శూన్యమే అనాలి. 

పక్కనున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీ ఆర్ దేశాన్ని ఏలడానికే ఆలోచిస్తూ దారులు వేసుకోవడానికి ప్రయత్నిస్తు న్నారు. ఇటు ఉన్నదాన్ని చెడగొట్టుకుని మళ్లీ కొత్త కార్యక్రమం టార్చితో దారిని వెతుక్కో వడంలో పడటమే ప్రజలకు గొప్ప కామెడీ అనిపిస్తుంది. కేవలం ఫోన్ నెంబర్ మార్చినంత మాత్రాన ప్రజలు చంద్రబాబుతో సంప్రదించినంత నమ్మకంతో జగన్ ని సంప్రదిస్తారా? అవకాశమే లేదని విశ్లేషకుల మాట. ప్రజల కోసం, ప్రజల మాట వినాలనే 2019లో అధికారంలోకిరాగానే స్పందన అనే కార్యక్రమం ఆరంభించారు. కానీ దానికి వాస్తవానికి అనుకున్నంత స్పందనయితే రాలేదు. కేవలం ప్రచారంలో కొట్టుకుపోయింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు ఇ మెయిల్, ఫోన్ ద్వారా తెలి యజేయడానికి వీలుంటుదని సీఎం కార్యాలయం తెలియజేసింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సమ యంలో ప్రజా దర్బార్ ఉండేది. అప్పట్లో అది విజయవంతమయింది. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ కార్య క్రమానికి ఆదరణ లేదు. 

ఇప్పుడు ఎన్నికలు ముంచుకువస్తున్నాయి గనుక ముందే తేరుకుని ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలతో నేరుగా మాట్లాడి నేనే మీకు సేవకుడిని నా తప్పులు కాయండి అంటూ బతిమాలి బామాలి మళ్లీ అధి కారంలోకి రావాడానికి ఇదో మార్గంగా పెట్టుకున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించి, పనిగట్టు కుని జగనన్నకు చెప్పుకోవడానికి ప్రజలకు ప్రత్యేకించి సమస్యల కంటే ప్రధాన సమస్య పాలనాపర సమస్యే ఉంది. అంటే సీఎంతోనే వారికి సమస్య అయినపుడు ఇక ఆయనకు ప్రజలు ఫోన్ చేసి ప్రత్యేకించి విన్నవించుకునేదేముంటుంది? మూడు రాజధానులతో ప్రజల్లో విభేదాలు తలెత్తి, రైతుల పాదయాత్రను అడ్డుకోవడంలో పోలీసు బలగాన్ని, రాజకీయ చతురతను ప్రదర్శించడంలో అవమా నాలు పాలయిన ప్రభువుకి ప్రజలు ఏం చెప్పుకుంటారు. ఓక్క ముక్కలో చెప్పాలంటే పాలకుడే పెను సమస్య అయినపుడు ప్రజలు విన్నవించుకునేదేముంటుంది.. ఎవరికి విన్నవించుకోవాలి.. కేవలం ఓటుతో బుద్ధి చెప్పడం తప్ప. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu