బీజేపీ, టీఆర్ఎస్ లక్ష్యం కాంగ్రెస్సే.. మునుగోడు డ్రామా అందుకేనా?

బీజేపీ, టీఆర్ఎస్ ల లక్ష్యం హస్తం పార్టీయేనని మరో సారి తేటతెల్లమైపోయింది. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అని తెలుగు వన్ ఎప్పుడో చెప్పింది. తాజాగా బీజేపీ ప్రచార సరళి తెలుగువన్ నాడే చెప్పిన విషయం వాస్తవమేనని రూఢీ చేసింది. ఇంతకే విషయమేమిటంటే..? మునుగోడు ప్రచారంలో బీజేపీ కొత్త పుంతలు తొక్కింది. ప్రచారంలో కొత్త ఎత్తుగడలు, వినూత్న పోకడలను తప్పుపట్టాల్సిన పని లేదు. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేసుకుంటాయి. తప్పులేదు. కానీ బీజేపీ తన ప్రచారం కోసం కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ ను పోలిన మనిషిని.. అంటే డూప్ ను తీసుకువచ్చింది.

ఆ వ్యక్తి పూర్తిగా వైఎస్సార్ వేషధారణలో.. వైఎస్సార్ ను అనుకరిస్తూ.. ఆయన గొంతును ఇమిటేన్ చేస్తూ బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ ను రంగంలోకి దింపడం ద్వారా అంటే ఆయనను పోలిన వ్యక్తిచేత ఆయనను అనుకరిస్తూ, గొంతును మిమిక్రీ చేస్తూ ప్రచారం సాగిండం ద్వారా బీజేపీ తన ప్రధాన ప్రత్యర్థి తెరాస కాదు.. కాంగ్రెస్ పార్టీయేనని మరోసారి రుజువు చేసింది. ఎందుకంటే.. మునుగోడులో ప్రధానంగా బీజేపీ- టీఆర్ఎస్ ల మధ్యే పోటీ జరుగుతోందని అంటున్నారు. ఇరు పార్టీలూ కూడా పరస్పర విమర్శలు, దూషణలు, ఆరోపణలతో చెలరేగిపోతున్నాయి. అయితే ఇదంతా పైపైకే.. తెర వెనుక జరుగుతున్న రాజకీయం పూర్తిగా వేరు. మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ లో విజయం కోసం పోరాడుకోవడం లేదనీ ఇరు పార్టీలూ కలిసి కాంగ్రెస్ కు దెబ్బకొట్టే యత్నంలో నిమగ్నమై ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు. తెలుగువన్ ఈ విషయాన్ని చాలా కాలం కిందటే.. అంటే తెరాసను భారాసగా మారుస్తూ కేటీఆర్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే వెల్లడించింది. బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్  అన్న శీర్షికన వార్తా కథనంలో బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అన్న విషయాన్ని తేటతెల్లం చేసింది.  ఇప్పుడు తాజాగా బీజేపీ వైఎస్ఆర్ ను పోలిన వ్యక్తి చేత ఆ నాయకుడిని అనుకరిస్తూ చేయించిన ప్రచారం ఈ విషయాన్ని మరో సారి నిర్ద్వంద్వంగా తేటతెల్లం చేసింది.

ఎందుకంటే. . అసలు మునుగోడు ఉప ఎన్నిక లో  టీఆర్ ఎస్, బీజేపీల మధ్య. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందని ప్రతి సర్వే విస్పష్టంగా తేల్చేస్తోంది.   ఈ పరిస్థితుల్లో చిత్రంగా బీజేపీ కాంగ్రెస్ మహానేత వాయిస్ ను ప్రచారానికి  ఉపయోగించుకోవడం కాంగ్రెైస్ ను ఇక ఎంత మాత్రం పుంజుకోకుండా చేయాలన్న లక్ష్యమే కనిపిస్తోంది.   నిజంగా టీఆర్ఎస్ ను ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంటే.. ప్రచారానికి కాంగ్రెస్ నాయకుడి వాయిస్ ను కాకుండా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాయిస్ ను మిమిక్రీ చేయిస్తూ ఆ పార్టీపై సెటైర్లు విమర్శలు గుప్పించాలి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరించింది. ఇదే బీజేపీ- టీఆర్ఎస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందాన్నీ, ఒడంబడికను, అవగాహననూ ఎత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు. అక్టోబర్6వ తేదీన తెలుగువన్ తన వార్తా కథనంలో తెరాస, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాన్ని ఎండగట్టింది.

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మిత్రులు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి ఇద్దరూ హ్యాట్రిక్ సాధించేందుకు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.  వ్యూహాత్మక వైరాన్ని ప్రదర్శిస్తున్నారు. నువ్వు కొట్టినట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి అటు ఉభయ పక్షాలూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది ప్రత్యర్ధి పార్టీలు చేసే ఆరోపణ అనిపించినా, కాదు. నిజం. 
  ఇప్పడు మరోసారి అదే విషయం తేట తెల్లంగా తెలిసిపోయింది. విజయ దశమి పండగ పూట కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. మోడీ గుజరాత్ మోడల్ కు కేసేఆర్ తెలంగాణ మోడల్ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటూ చాలా కాలంగా ప్రచారం కూడా జరుగుతోంది. 

కానీ, ఇంతా చేసి చివరకు జాతీయ పార్టీ ప్రకటన తర్వాత, ఆయన తమ జాతీయ పోరాటం గుజరాత్ నుంచి కాదు  మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రారంభ మవుతుందని ప్రకటించారు. నిజానికి, కర్ణాటక, మహా రాష్ట కంటే ముందుగా గుజరాత్ అసెంబ్లీకి మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నిజంగా మోడీని, గుజరాత్ మోడల్ ను  వ్యతిరేకించడమే నిజం అయితే, ముందుగా ఆయన తమ జాతీయ పోరాటాన్ని గుజరాత్ నుంచి  ప్రారంభిచాలి. కానీ, అయన అసలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావనే తీసుకురాలేదు. దీని భావమేమి చంద్రశేఖర అంటే సమాధానం రాదు. 

నిజానికి కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే  కేంద్రంలో మళ్ళీ మరో సారి మోడీని గెలిపించెందుకే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే చెపుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు కేసీఆర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు కాంగ్రెస్ మిత్ర పక్షాలను ఏకంచేసి దిశగా ప్రయత్నాలు సాగిస్తునారు. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు.  అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే కేసేఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్ర. సరే ఆ ప్రయత్నం ఫలించ లేదనుకోండి అది వేరే విషయం. 

ఆ ప్రయత్నం విఫలమైంది కాబట్టే ఇప్పుడు జాతీయ పార్టీ పేరున తక్షణం అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలను వదిలేసి బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కర్ణాటక,మహారాష్ట్రలను ఎంచుకున్నారు. అంత వరకు ఎందుకు గడచిన ఎనిమిది సంవత్సరాలలో  తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి  చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు.

సో ... అనుమానం లేకుండా కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్, నిజానికి భారతీయ జనత పార్టీ  (బీజేపీ) బీ టీమ్.  ఇది కూడా ఆరోపణ కాదు నిజం అంటున్నారు. అందుకే, అందరి మీదకు ఒంటికాలు మీద లేచే సిబిఐ, ఈడీ తెలంగాణకు వచ్చే సరికి వట్టి ఊపులే తప్ప గట్టి  చర్యలు తీసుకోవడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు, దివంగత వైఎస్సార్ ను పోలి ఉన్న వ్యక్తితో మునుగోడులో ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ దిగడంతోనే టీఆర్ఎస్ లక్ష్యం బీజేపీ కాదన్న సంగతి తేటతెల్లమైపోయింది. కవితకు లిక్కర్ స్కామ్ లో ఆరోపణల సెగ తప్ప, ఆప్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను విచారించినట్లుగా విచారించడానికి సీబీఐ, ఈడీలు ముందుకు రాకపోవడమే తార్కానం. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu