జగన్ ఇగో వదులుకో... చంద్రబాబు
posted on Oct 20, 2022 4:04PM
అధికారంలో ఉన్నవారు ప్రజాసమస్యల్ని పట్టించుకోవాలి. ప్రజలకు మేలు జరిగే విధంగా పథకాలు అమలుచేస్తూ, ప్రజల ఆదరణపొందాలేగాని ప్రజాగ్రహానికి గురికాకూడదు.కానీ చిత్రంగా జగన్‌పాలన పూర్తిగా ప్రజావ్యతిరేకంగా మారిపోయింది. ఆయన ప్రతీ కార్యక్రమాన్ని పథకాన్ని ప్రజలు వ్యతిరేకించారు. ఆయన పాలన పట్ల విసిగెత్తారు. ఆయనకు ప్రజలు ప్రతీప్రాంతంలోనూ ఎదురుతిరుగుతున్నారు. ఈ పరిస్థితులన్నీ జగన్ స్వయం కృతమేననే అభిప్రాయా లే వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రజాసమస్యల మీద ఇగో వీడి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ కూడా చేశారు.
నర్సీపట్నంలో విద్యార్ధుల పోరాటానికి టీడీపీ అధినేత మద్దతు పలికారు. ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్ధమవుతుందో అర్ధంగావడం లేదని ఆయన అన్నారు. చివరికి చిన్నపిల్లలు కూడా వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసన బాటపట్టే స్థితికి రాష్ట్రాన్నితీసుకువచ్చారని ఆరోపించారు. నర్సీపట్నంలో వరాహ నదిపై తమ ప్రభుత్వం హయాంలోనే వంతెన నిర్మించామని కానీ జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేయలేదని అన్నారు. ఈ కారణంగానే మోడల్ స్కూలు విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
విద్యార్ధులు నీళ్లలోకి దిగి మరీ తమ కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏం కట్టలేరని ్రపతి ఒక్కరికీ తెలుసునని కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు మేలుచేసినవారవుతారన్నారు.
నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏం కట్ట లేరని ప్రతి ఒక్కరికి తెలుసు...కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’’ అంటూ చంద్రబాబుట్వీట్టర్‌లో పేర్కొన్నారు.