Get all the updates about andhra pradesh news, political news, articles, sr journalists books, regional news, telugu cinema news etc. Find information about Telugu film news, regional news, current affairs, gallery, wallpapers, etc. See Telugu news, news videos along with latest news only at TeluguOne.com.
TeluguOne Services

అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్‌ను సిబిఐ అరెస్టు చేసింది. జగన్‌ను ఆదివారం సాయంత్రం 7 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అరెస్టు చేసింది. జగన్ అరెస్టును సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో ధ్రువీకరించారు. గత మూడు రోజులుగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. సోమవారం ఆయనను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ఈ నెల 28వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు ఇదివరకే జగన్‌కు సమన్లు జారీ చేసింది. సిబిఐ అధికారులు ఆదివారం సాయంత్రం దిల్‌కుషాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. జగన్ అరెస్టుకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రేపు సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.


.webp)




