జగన్‌ పార్టీలోకి బొబ్బిలి ఎంఎల్ఎ రంగారావు?

విజయనగరం జిల్లా బొబ్బిలి కాంగ్రెసు శాసనసభ్యుడు రంగారావు ఈరోజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడాతు తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరటంపై ప్రజాభిప్రాయం తీసుకుని పార్టీ మారడంపై ఆలోచన చేస్తానని ఆయన చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత తనను ఎవరూ అడ్డుకోలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తు తీరు సరిగా లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన సమయంలో వైయస్ జగన్‌ను విచారణకు పిలువడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌పై ఆరోపణలు మాత్రమే వచ్చాయని, ఆరోపణలు రుజువు కాలేదని, ఆరోపణలు రుజువు అయ్యే వరకు జగన్ తప్పు చేశారని చెప్పలేమని ఆయన అన్నారు.