పేరు మారింది.... ఫేట్ మారుతుందా..?

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకుండా పోయింది. అసలు పాదయాత్రం జరుగుతుందా లేదా అని అందురూ అనుకుంటున్న నేపథ్యంలో.. ఏదో ఒకటి చేసి ఓ డేట్ ను ఫిక్స్ ను చేశారు. అది నవంబర్ 2 వ తేదీ. కానీ అది కూడా కలిసిరాలేదు. ఎందుకంటే సీబీఐ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందేమో అన్న ఆశతో ఈ డేట్ ఫిక్స్ చేశారు. కానీ కోర్టు షాకిచ్చింది. దీంతో నవంబర్ 2 నుంచి పాదయాత్రను తలపెట్టిన జగన్ దాన్ని మరోసారి వాయిదా వేశారు. రెండో తేదీ గురువారం వ‌స్తోంది. నవంబర్ 3 శుక్రవారం కావడంతో, 6వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆ మార్నాడే, అంటే శుక్రవార‌మే జ‌గ‌న్ కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. భారీ ఎత్తున పాద‌యాత్ర ప్రారంభించి, ఆ మ‌ర్నాడే జ‌గ‌న్ కోర్టుకు వెళ్ల‌డం కోస‌మే యాత్ర‌కు బ్రేక్ ఇస్తే పాదయాత్ర కన్నా కోర్టు యాత్ర హైలెట్ అవుతుందని భావించి... అలా కాకుండా యాత్ర ప్రారంభించాక క‌నీసం ఓ మూడు రోజులైనా వ‌రుస‌గా జ‌నంలో జ‌గ‌న్ ఉంటేనే బాగుంటుంద‌నే 6వ తేదీకి మార్చినట్టు సమాచారం.

 

ఇదిలా ఉండగా పాదయాత్ర డేట్ మాత్రమే కాదు... పేరు మార్చినట్టు తెలుస్తోంది. ముందు ‘అన్నొస్తున్నాడు’ పేరుతో జగన్ పాదయాత్ర చేయలని భావించారు. కానీ ఇప్పుడీ పేరుని ‘ప్రజా సంకల్పం’గా మార్చినట్టు సమాచారం. అంతేకాదు త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించి పాదయాత్ర చేయాలన్నసంచలన నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల టాక్. దీనికి గాను వైసీపీ నేతలు సాకులు కూడా ముందుగానే రెడీగా పెట్టుకున్నారట. ఒకటి అధికార టీడీపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రను అడ్డుకొనేందుకే రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని.. రెండోది.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్వీకర్ కోడెల విఫలమయ్యారని.. వారిపై చర్యలు తీసుకొంటే వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాల్గొంటామని చెబుతున్నారు. మొత్తానికి ఎలాగైనా సరే పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించాలన్న జగన్ కోరిక నెరవేరుతుందో..? లేదో..? చూద్దాం..