ఉగ్రవాదులకు ఐసిస్ సూచనలు... దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని చంపండి..


ఐసిస్ ఉద్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఎక్కడో దగ్గర దాడులకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఐసిస్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉగ్ర‌వాద సంస్థ‌ ఐఎస్‌ఐఎస్‌ ప్రచురించిన ఎనిమిది పేజీల వ్యాసం ఒకటి బ‌య‌ట ప‌డింది. అందులో ఐసిస్ జిహాదీల‌కు ప‌లు సూచ‌న‌లు చేసింది. ఇస్లాంకు ద్రోహం చేసే మత అవిశ్వాసకులను చంపేయాల‌ని పేర్కొంది. దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని జిహాదీలు హ‌త‌మార్చాల‌ని చెప్పింది. అలాగే ఇండియాకు చెందిన అధికారులను, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ గూఢచారులను, పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ అధికారుల‌ను మ‌ట్టుబెట్టాల‌ని ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu