ట్రంప్ కు కిమ్ కౌంటర్... నేను కాదు ట్రంప్ పప్రంచ వినాశనకారి..
posted on Jun 10, 2017 4:12PM

అగ్రరాజ్యాల హెచ్చరికలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. దీంతో గత కొద్ది కాలంగా ఉత్తర కొరియా, అమెరికా మధ్య యుద్ద వాతావరణమే నెలకొంది. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య ఉన్న గొడవల వల్ల మూడో ప్రపంచ యుద్దమే వస్తుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రపంచ వినాశనకారిగా తనను సంబోధిస్తున్నారు కానీ.. పప్రంచ వినాశనకారిని తాను కాదని... అమెరికా అధ్యక్షుడేనని అన్నారు. ప్రపంచాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడటానికి 194 దేశాలు సంతకం చేయగా.. అమెరికా చేయకపోవడంపై కిమ్ స్పందిస్తూ... ప్రపంచాన్ని కాలుష్యం నుంచి కాపాడటానికి 194 దేశాలు సంతకం చేస్తే... ట్రంప్ మాత్రం వెనకడుగు వేశాడని... ఆయన సెల్ఫిష్ అంటూ ఎద్దేవ చేశాడు. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.