పేలుళ్ళతో దద్దరిల్లిన ఇరాక్, 73 మృతి

ఆదివారం వరుస పేలుళ్ళతో ఇరాక్ దద్దరిల్లింది. దేశంలోని పదకొండు నగరాలలో ఆదివారం పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 73 మంది మృతు చెందగా, 213 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో పలువురు సైనికులు ఉన్నారు. నస్సీరియాలోని ఫ్రాన్స్ దౌత్య కార్యాలయం సహా 11 నగరాలలో దాదాపు ఇరవై ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయి. సైన్యం, వాణిజ్య మార్కెట్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu