ఉప్పల్ లో  ఐపిఎల్ బ్లాక్ టికెట్ల దందా... ఒకరి అరెస్ట్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపిల్ రానే వచ్చేసింది. ఆదివారం  ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సన్ రైజర్స్ హైద్రాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్ శనివారం నాడు ప్రారంభమైంది. ఆదివారం జరుగనున్న రెండో మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  టీవీల్లో కాకుండా నేరుగా ఉప్పల్ స్టేడియంలో లైవ్ చూడాలన్న ఉబలాటం కూడా ఎక్కువగానే ఉంది. ఈ మ్యాచ్ కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఎక్కువమందికి టికెట్లు దొరకక ఎదురు చూస్తున్నవారు లేకపోలేదు. 
దీన్ని ఎన్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారు. టికెట్ల కోసం వెళ్లిన వారికి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నభరద్వాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భరద్వాజ్ నుంచి నాలుగు టికెట్లు స్వాధీనం చేసుకుని కేసు  నమోదు చేశారు.