చిక్కుల్లో మాజీ స్పీకర్ తమ్మినేని
posted on Mar 24, 2025 12:18PM
ఎపి మాజీ సభాపతి తమ్మినేని సీతారాం చిక్కుల్లో చిక్కుక్కున్నారు. తాజాగా ఆయన చుట్టూ నకిలీ డిగ్రీసర్టిఫికేట్ వివాదం చుట్టుకుంది. టిడిపి ఎమ్మెల్యే కూనరవికుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి విచారణ చేయనుంది. తమ్మినేని మొదట్నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో మాజీ సభాపతి తప్పుడు ధ్రృవపత్రం సమర్పించినట్లు కూనరవికుమార్ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, సిఐడిలకు వేర్వురుగా ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. తమ్మినేనిపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. కూనరవికుమార్ ఫిర్యాదును సిఐడి స్వీకరించింది. తమ్మినేనికి నోటీసులు జారి చేయనుంది. తమ్మినేనిపై వచ్చిన ఆరోపణలపై గత వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది.