డ్యూటీ విత్ డెమోక్రసి

సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఈ ప్రజాస్వామ్యం అనే పదంలోనే ప్రజలు ఇమిడిపోయి ఉన్నారు. 

ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారని అబ్రహం లింకన్ నిర్వచించారు.

అట్లాగే భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే ప్రజలు మాత్రం దానికి అనుగుణంగా ఉన్నారా అంటే ఆలోచించాల్సిందే మరి. 

ప్రజల చేత….
ప్రజల కొరకు…
ప్రజలే ఎన్నుకోవడం……

పై మూడు పదాలను మళ్ళీ మళ్ళీ చెడితే అర్ధమయ్యే విషయం ప్రజలకు దేశం గూర్చి బాధ్యత ఉండాలని. కానీ ఈ దేశంలో బాధ్యాతాయుత పౌరులు ఎందరు అన్నది ప్రశ్నార్థకం. ఇది ఒక మనిషినో, ఒక సమూహన్నో, ఒక సంఘాన్నో, ఒక సమాజాన్నో కాకుండా యావత్ భారతీయులందర్ని అడగాల్సిన ప్రశ్న మరి. 

అసలు బాధ్యత అంటే ఏమిటి??

ఇల్లు, ఇంట్లో కుటుంబ సభ్యులు. వాళ్ళు అందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు, అలా ప్రతి రోజు పనులు చేస్తూ ఉంటారు. అమ్మ వంట చేస్తుంది, నాన్న సంపాదించుకొస్తాడు, పిల్లలు చదువుకుంటారు, ఆడపిల్లలు ఇంట్లో పనులు చేస్తుంటారు, మగపిల్లలు బయటకెళ్లి చేయాల్సిన పనులు చేస్తారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ సాగిపోతారు. ఇదంతా ఇంట్లో ఉన్న మనుషుల బాధ్యత. మరి ఇలాంటి బాధ్యత సమాజం విషయంలో, దేశం విషయంలో అక్కర్లేదా??

రోజు ఇంట్లో పనులు చేస్తుంటే పడక గది నుండి, వంట గది దాకా అన్ని చోట్లా నుండి చెత్త పొగవుతుంది. పొడి చెత్త తడి చెత్త కూడా. వాటిని అట్లాగే రోజుల తరబడి ఇంట్లో ఉంచుకుంటే ఇల్లంతా దుర్గంధమే. ఈ విషయం మనకు తెలుసుం అందుకే చక్కగా దాన్ని తీసుకుపోయి ఇంటికి అవతల లేదా వీధి చివర వేస్తాం. దాన్ని అక్కడ శుభ్రం చేయకపోతే వీదంతా కంపు గొడుతుంది. కానీ నాకెందుకు అని పట్టించుకోమ్. అట్లాంటి బాధ్యత రహితాలే క్రమంగా  పెరిగి దేశం పట్ల కూడా బాధ్యతా రహితంగా ఉంటున్నారు నేటి జనం. 

మనిషి తన పని కోసం ఎంత నిజాయితీగా, క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తాడో అలాగే తనకున్న బాధ్యత విషయంలో సమాజం పట్ల, దేశం పట్ల కూడా స్పందించగలగాలి. 

కేవలం ప్రభుత్వ విషయానికే ప్రజాస్వామ్యం అనేది వర్తిస్తోందని అనుకోవడం మూర్ఖత్వం. దేశం మీద ప్రజలకు ఉన్న బాధ్యతను గుర్తు చేసుకుంటే దేశంలో ఎన్నో పరిస్థితులలో మార్పులు చాలా సులువు అవుతాయి.

ప్రజాస్వామ్యం గురించి తమ బాధ్యతల గురించి ప్రతి మనిషి తమలో తాము డెమో నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని గ్రహించి ఇప్పుడే మొదలుపెడితే.

ముందు వచ్చేది ఆరోగ్యకరమైన మార్పే!! అదే అసలైన ప్రజాస్వామ్యం అవుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ