చాక్లెటే అని తీసిపారేయకండి..

 

సైన్స్ పరిశోధనలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక రోజు కాఫీ మంచిది కాదన్న పరిశోధన బయటకు వస్తుంది. ఆ పరిశోధనని అనుసరించి మర్నాడు ఓ లోటాడు కాఫీ తాగుతూ దినపత్రికని చదవడం మొదలుపెడతామా.... కాఫీ ప్రాణాంతకం అని మరో పరిశోధన కనిపిస్తుంది.  ఏ పరిశోధనని ఎంతవరకూ నమ్మాలో తెలియని అయోమయంలో జనం ఉండిపోతారు. కానీ చాక్లెట్ల గురించి చాలా రోజులుగా మంచి విషయాలే వినిపిస్తున్నాయి. ఇవాళ ఇంటర్నేషనల్ చాక్లెట్స్ డే సందర్భంగా చాక్లెట్ తినడం వల్ల కలిగే లాభాల గురించి ఒకసారి తెలుసుకుందాం.

* మనలో చాలా మంది చాక్లెట్ తినడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు..కానీ బరువు తగ్గాలని అనుకున్న వారికి చాక్లెట్ అద్భుతంగా పనిచేస్తుంది.

* చాక్లెట్ రక్త సరఫరాను క్రమబద్దీకరిస్తుంది..అంతేకాకుండా రక్తం గట్టకుండా సహాయపడుతుంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు చాక్లెట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట.

* రోజుకు వందగ్రాముల చాక్లెట్ తినడం వల్ల మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చని తేల్చారు..లండన్‌లోని వార్విక్ యూనివర్శిటీ వైద్యులు.

* రోజుకు ఒక చాక్లెట్ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ యూనివర్శిటీ పరిశోధకులు..

* రోజు ఒత్తిడితో సతమతమవుతున్న వారు ఒక చిన్న చాక్లెట్ ముక్క నోట్లో వేసుకుంటే చాలట..దీనిలో సహజంగా ఉండే ఫెనిలెధిలమైన్ ఎండార్పిన్‌ ఒత్తిడి స్థాయిని తగ్గించి యాంటీ డిప్రెషన్‌గా పనిచేస్తుందట.

మరి ఇన్ని ఆరోగ్య లాభాలను కలిగించే చాక్లెట్స్‌ను మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోండి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu