దేవుడా.. భారత్ పై చైనా ప్రశంసలు..

 

ప్రస్తుతం భారత్-చైనా పరిస్థితి పచ్చ గడ్డి వేస్తేనే భగ్గమనే పరిస్థితి నెలకొంది. సిక్కిం సరిహద్దు విషయంలో రెండు దేశాల మధ్య వార్ నడుస్తోంది. ఇక చైనా అయితే భారత్ కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చేస్తుంది. ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాల బెదిరింపులకు పాల్పడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పరస్పరం ప్రశంసలు కురిపించుకుని రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు. జర్మనీలోని హాంబర్గ్‌లో జరగనున్న జీ-20 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో రెండు దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు అగ్రనాయకులిద్దరూ చేతులు కలిపారు. పరస్పరం పలకరించుకున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. 2016లో గోవాలో బ్రిక్స్‌ సదస్సును భారత్‌ విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇండియా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలను కొనియాడారు. ఇండియా మరింత విజయవంతం కావాలని జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు. ఇక చైనాలోని షియామెన్‌లో వచ్చే ఏడాది జిన్‌పింగ్‌ అధ్యక్షన జరగనున్న బ్రిక్‌ సదస్సును విజయవంతం చేసేందుకు సహకారం అందిస్తామని నరేంద్ర మోదీ తెలిపారు. మొత్తానికి రెండు దేశాల మధ్య ఉన్న గొడవలను తగ్గించడానికి ఇద్దరు నేతలు ముందుకు రావడం అభినందించాల్సిన విషయమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu