ఎమ్మెల్యేకు కోపం వచ్చింది.. కమిషనర్‌పై చేప విసిరికొట్టాడు..
posted on Jul 7, 2017 4:24PM
.jpg)
ఓ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. అంతే చేప తీసుకొని కమిషనర్‌పై విసిరికొట్టాడు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని పలువురు మత్యకారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నితేష్ రాణేను కలిశారు. ఈసందర్భంగ ఆయన మత్యశాఖకు చెందిన కమిషనర్‌తో మాట్లాడటానికి అక్కడికి వెళ్లారు. అయితే ఈ సమావేశంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే వారి మధ్య చేపలబుట్టలో ఉన్న ఒకచేపను తీసుకొని ఆగ్రహంతో కమిషనర్ పై విసిరి కొట్టారు. ఈ విషయం రాద్ధాంతం కావడంతో మీడియా ప్రశ్నించగా గతంలోనే మత్యకారుల సమస్యలను కమిషనర్ వద్దకు తీసుకెళ్లామని, అయినా ఆయన స్పందించలేదని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాధికారులను ఏ విధంగా భరించాలంటూ ఆయన మీడియాను ప్రశ్నించారు.