గడ్డం అడ్డమే అంటోన్న సుప్రీమ్ కోర్టు!

 

గడ్డం మగవాళ్ల ఐడెంటిటీలో భాగం. చాలా వరకూ మేధావులు, సాధువులు, ముల్లాలు, మత గురువులు కూడా గడ్డాలు పెంచుతుంటారు! ఒక్కోసారి సినిమా హీరోలు కూడా క్యారెక్టర్ లో డెప్త్ రావాలంటే గడ్డం పెంచేస్తుంటారు. అసలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయే గడ్డంలోనే ఏదో తెలియని గాంభీర్యం వుంది. అందుకే, అన్ని వదిలేసిన సన్యాసులు మొదలు అన్నీ తెలుసన్నట్టు మాట్లాడే మేధావుల వరకూ గడ్డం గీయకుండా వుండటానికే ప్రిఫర్ చేస్తారు! కాని, తాజాగా గడ్డం పెంచేసుకోటం తప్పంటోంది సుప్రీమ్ కోర్టు. అయితే, ఎవ్వరూ పెంచొద్దని మాత్రం చెప్పటం లేదు...

 

ఇంతకీ విషయం ఏంటంటే, ఆ మధ్య భారత వాయుసేనకు చెందిన ఓ ముస్లిమ్ ను గడ్డం పెంచాడనీ, గీసుకునేందుకు నిరాకరించాడనీ సస్పెండ్ చేశారు. ఆయన దీనిపై సుప్రీమ్ కు వెళ్లాడు. సిక్కులకి  గడ్డం పెంచుకోవటం, తలపాగా పెట్టుకోవటం తప్పు కానప్పుడు ముస్లిమ్ లు గడ్డం పెంచితే తప్పేంటని ఆయన వాదించారు. సుప్రీమ్ ఈ కేసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు, ఇండియన్ గవర్నమెంట్ కు నోటీసులు ఇచ్చింది. అయితే, 2008 నుంచీ నడుస్తోన్న ఈ కేసులో తాజాగా సుప్రీమ్ జడ్జీలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిమ్స్ అయినా సరే భద్రతా దళాల్లో వున్నప్పుడు గడ్డం తీసి నీట్ గా షేవ్ చేసుకోవాల్సిందేనని వారు అన్నారు. అది క్రమశిక్షణలో భాగంగా చూడాలే తప్ప మత స్వేచ్ఛకు భంగంగా చూడొద్దని అన్నారు. అయితే, సిక్కులకి మాత్రం దీన్నుంచి మినహాయింపు వుంది. ఇక ముందు కూడా అది అలాగే కొనసాగే అవకాశమే వుంది.

 

సిక్కులకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ .. ఎందులో అయినా గడ్డం, తలపాగా అనుమతించబడతాయి. ఇది వాళ్ల మత నియమాన్ని గౌరవిస్తూ ఇచ్చే వెసులుబాటు. కాని, భద్రతా దళాల్లో పని చేసే ఇతర మతాల వారు, అంటే, హిందు, ముస్లిమ్, క్రిస్టియన్, పార్సీ ... ఎవరైనా క్లీన్ గా షేవ్ చేసుకోవాల్సిందే. హెయిర్ కట్ కూడా నియమాలకి లోబడే చేయించుకోవాలి. దీనికి కారణం సిక్కుల్లాగా ఇతర మతాల వారు అందరూ, అన్ని వేళలా గడ్డం పెంచకపోవటమే. వాళ్లు దాదాపుగా ఎప్పుడూ గడ్డం, జుట్టు కత్తిరంచరు. ఈ నియమం కాణంగానే సిక్కులకి అన్ని రంగాల్లో గడ్డం, తలపాగాకు సంబంధించి ప్రత్యేక మినహాయింపు కొనసాగుతూ వస్తోంది.

 

2008 నుంచీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై కోర్టులో పోరాడుతూ వస్తోన్న సస్పెండ్ అయినా ఉద్యోగి అన్సారీ, ఫైనల్ జడ్జిమెంంట్ కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సి వుంటుంది.ఇంకా ఈ కేసులో తుది తీర్పు ఇవ్వలేదు సుప్రీమ్.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu