షాకింగ్.. అంబ‌టి రాయుడిపై ఐసీసీ నిషేధం!!

 

టీమిండియా క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయకుండా అతనిపై వేటు వేసింది. ఈ నెల 13వ తేదీన సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో అంబ‌టి రాయుడు బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో రాయుడి బౌలింగ్ యాక్ష‌న్ అనుమానాస్పదంగా ఉంద‌ని ఐసీసీకి ఫిర్యాదు అందింది. దీంతో రాయుడిని బౌలింగ్ యాక్ష‌న్‌కు సంబంధించిన ప‌రీక్ష‌కు హాజరు కావాల్సిందిగా ఐసీసీ అదేశించింది. నిర్ణీత 14 రోజుల్లోగా ఆ ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల‌ని సూచించింది. అయితే రాయుడు 14 రోజులు దాటిపోయినా ఆ ప‌రీక్ష‌కు హాజ‌రుకాలేదు. దీంతో ఐసీసీ నిబంధ‌న‌ల్లోని 4.2 క్లాజ్ ప్ర‌కారం ఐసీసీ అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల్లో అతని బౌలింగ్‌ను నిషేధించింది. ప‌రీక్ష‌కు హాజ‌రై బౌలింగ్ యాక్ష‌న్ స‌క్ర‌మంగానే ఉంద‌ని రిపోర్టు వ‌చ్చేవ‌ర‌కు ఈ నిషేధం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీ క్రికెట్‌లో‌ అతను బౌలింగ్‌ కొనసాగించే అవకాశముంది.