హెచ్ఎండీఏ కమిషనర్ పై బదిలీ వేటు.. మరో ట్విస్ట్!!

 

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కమిషనర్ బి. జనార్దన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను తప్పిస్తూ సోమవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ పర్యటనలో ఉండగానే జనార్దన్ రెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే జనార్దన్ రెడ్డిని వెయిటింగ్‌లో పెట్టింది. విదేశాల నుంచి రాగానే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.