పబ్లిక్ లో మహిళ చున్నీ లాగిన మాజీ సీఎం!!

 

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అది చేస్తాం, ఇది చేస్తామని హామీలు ఇస్తారు. ఓట్లు వేయమని బ్రతిమాలతారు. తీరా ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలు గుర్తుచేస్తే భయపెడతారు. తాజాగా అలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నాడు కర్ణాటక మాజీ సీఎం  సిద్దరామయ్య పర్యటించారు. ఈ నియోజకవర్గం నుండి సిద్దరామయ్య తనయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని జమలా రాణి అనే మహిళ సిద్దరామయ్య దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన సిద్దరామయ్య ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించారు. నన్నే నిలదీస్తావా అంటూ సిద్దరామయ్య ఆ మహిళపై విరుచుకుపడ్డారు. ఆ మహిళ వద్ద ఉన్న మైక్‌ను లాగేసే ప్రయత్నం చేశారు. మైక్‌తో పాటు ఆ మహిళ ధరించిన చున్నీ కూడ వచ్చేసింది. దీంతో.. సమస్యలను పరిష్కరించాలని  ప్రస్తావించినందుకు  తనను అవమానించారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిద్దరామయ్య తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.