జూడాల సమ్మెపై హైకోర్టులో పిల్..నోటీసులు

హైదరాబాద్: జూనియర్‌ డాక్టర్‌ల సమ్మె చట్టవిరుద్దమని ఓ న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌, మెడికల్‌ కౌన్సిల్‌, జూడాలకు నోటీసులు జారీచేసింది. పీవీ క్రిష్ణయ్య అనే న్యాయవాది వేసిన పిటిషన్‌లో సమ్మె అత్యవసరంగా నిలిపివేయించాల్సిన అవసరం ఉందని..అందుకుగాను కోర్టు కలుగచేసుకొని ఆదేశాలివ్వాలని ఆయన అభ్యర్థించారు. కోర్టు ఇరు పక్షాలకు కౌంటర్‌ దాఖలు చేసుకునేందుకు సమయమిస్తూ కేసు రేపటికి వాయిదా వేసింది.