రోజూ ఉదయమే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!
posted on Nov 1, 2024 10:16AM
ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే..
ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది.
ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు, హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియ, పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గొంతు నొప్పి, గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం, ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు, శ్వాసకోశ ఆరోగ్యం, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు, విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది.
ఏ ఉప్పు వాడితే మంచిదంటే..
నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు. తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు, గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
*రూపశ్రీ.