సాగర్‌లో నీటి విడుదల తగ్గించాలి... గుత్తా...

 

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అలాగే నాగార్జునసాగర్‌లో కూడా నీటిని విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఇలా నాగార్జున సాగర్‌లో కూడా నీటిని విడుదల చేయడం వల్ల నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం వుండటంతోపాటు నీటి నిల్వలు కూడా తగ్గిపోయే ప్రమాదం వుందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో నీటి విడుదల తగ్గించాలని కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. రబీ పంటల కోసం నీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం వుండేలా చూడాలని కోరారు.