మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు

టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో  ఆయన్ను గత ఏప్రిల్ లో అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ రద్దుచేయాలని చిత్లూరు జిల్లా వన్ టౌన్ పోలీసులు అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ చేపట్టిన న్యాయ స్థానం సోమవారం  నారాయణ బెయిల్ ను రద్దు చేసింది. 

గతేడాది ఏప్రిల్ లో చిత్తూరు జిల్లా నెళ్లేపల్లి హైస్కూల్లో టెన్త్ తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా లీకయింది.  అప్పట్లో ఈ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఈ కేసు కలకలం రేపింది. దీనికి వెనుక మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్టు జిల్లా పోలీసులు ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.  ఆయన్ను కోర్టుకు హాజరుపర్చగా 2014లోనే నారాయణవిద్యాసంస్థల అధినేత బాధ్యతలనుంచి తాను తప్పుకున్నారని ాయన తరఫు న్యాయవాదులు కోర్టెకు తెలిపారు. అప్పుడు ఆయనకు ఇచ్చిన బెయిల్ ఇప్పుడు జిల్లా 9వ అడిషనల్ కోర్టు రద్దుచేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu