గుంటూరు కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య
posted on Aug 5, 2015 3:47PM
.jpg)
ఒకవైపు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్ విద్యార్ధి రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ జరుగుతున్నా సమయంలోనే గుంటూరు పుల్లడిగుంటలో గల ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మళ్ళీ అటువంటి సంఘటనే జరిగింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని సునీత కళాశాల భవనం పనుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది. ఈ సంగతి తెలుసుకొన్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సునీత ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.
ఆమె ఫైనల్ ఇయర్ విద్యార్ధిని అయినందున ర్యాగింగ్ జరిగే అవకాశం ఉండదు కనుక వేరే ఇతర కారణాలు ఏమయినా ఉండి ఉండవచ్చును. ర్యాగింగ్ తరువాత విద్యార్ధుల జీవితాలను ఎక్కువగా బలి తీసుకొంటున్నది ఒత్తిడి లేదా ప్రేమలు. చాలా కాలేజీలు తమ సంస్థకు ఇంకా మంచి పేరు వచ్చేందుకు తమ విద్యార్ధులు పరీక్షలలో చాలా ఎక్కువ మార్కులు సాధించాలనే ఆలోచనతో వారిని విపరీతమయిన ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా చదువలలో బాగా రానిస్తున్నవారు, అస్సలు చదవలేకపోతున్న విద్యార్దులపై ఈ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. సునిత్ ఫైనల్ ఇయర్ విద్యార్ధిని కనుక ఆమె కూడా అటువంటి ఒత్తిడికి గురయి ఉండే అవకాశం ఉంది. ఇక ప్రేమ విఫలం కారణంగా కూడా విద్యార్ధులు తమ జీవితాలను బలి చేసుకొంటున్నారు. సునీత ఆత్మహత్యకి కారణం ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది.