మాధురి మామూలు జాదూ కాదండోయ్!
posted on Aug 12, 2024 4:10PM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఇంతకాలం చక్కగా ‘అడల్ట్రీ’వ్యవహారం నడుపుకుంటున్న వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి వ్యవహారశైలి చూస్తుంటే వామ్మో మామూలు మహిళ కాదు.. మహా జాదూ అనే విషయం అర్థమవుతోంది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పాలిటిక్స్ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వింటుంటే మహామహులకే బుర్ర తిరిగిపోతోంది. ఇంతకాలం పలువురు వైసీపీ నాయకుల మీద లైంగిక ఆరోపణలు వచ్చినా, అడ్డంగా దొరికపోయినా ‘అలాంటిదేమీ లేదు.. అంతా ప్రతిపక్షాల కుట్ర’ అనే మాటలే జనం విన్నారు తప్ప.. ఇలా దివ్వెల మాధురిలాగా ‘ఎస్.. మా ఇద్దరికీ సంబంధం వుంది’ అని ధైర్యంగా చెప్పడం ఇంతవరకు కనీవినీ ఎరుగని వ్యవహారం. నిలువెత్తు దర్శనం ఇచ్చిన గోరంట్ల మాధవ్ సైతం ‘ఆ వీడియోలో వున్నది నేను కాదు’ అని సిగ్గుపడుతూ చెప్పడం చూశాం గానీ.. ‘అవును మా మధ్య సంబంధం వుంది’ అంటూ దివ్వెల మాధురి కనబరిచిన తెగింపు మాత్రం మామూలు విషయం కాదు.
దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ వ్యవహారంలో అన్ని వైపుల నుంచి తన మీద ఒత్తిడి పెరిగిపోయేసరికి దివ్వెల మాధురి కారు యాక్సిడెంట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తూ మాధురి కూడా తాను ఆత్మహత్య చేసుకోవడానికే కారు యాక్సిడెంట్ చేసినట్టు చెబుతోంది. కానీ, ఆమె చేసింది ఆత్మహత్యాయత్నం కాదని, సంచలనం క్రియేట్ చేసే ప్రయత్నమని పరిశీలకులు అంటున్నారు. దివ్వెల మాధురి యాక్సిడెంట్ చేసిన కారు చాలా సేఫ్టీ మెజర్లు వున్న కారు అని తెలుస్తోంది. ఓ మోస్తరు యాక్సిడెంట్‌కి గురైనప్పటికీ సదరు కారులో వున్న వారికి ఏమీ కాదని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మాధురి, కారు ప్రమాదం క్రియేట్ చేసి ఆత్మహత్యాయత్నం చేసినట్టు కలరింగ్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. యాక్సిడెంట్ అయి కార్లు వెల్లకిలా పడిపోయినప్పటికీ, మాధురి హాయిగా మీడియా మైకుల ముందు గంటలకు గంటలకు స్పీచ్‌లు ఇస్తూనే వుంది. ఈ మహాతల్లి గుద్దిన కారులో వున్న ముగ్గురు వృద్ధులు మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మాధురి నిజంగానే ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంలో వుంటే ఆమెకి ఇంట్లోనే ఎన్నో అవకాశాలు అందుబాటులో వుంటాయి. కన్ఫమ్‌గా పైకి పోయే ఎన్నో ఆప్షన్లు వుంటాయి. ఇలా రోడ్డు మీదకి సేఫ్టీగా వుండే కారులో యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం వుండదని పరిశీలకులు అంటున్నారు.