భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర వెండి కాయిన్స్ పంపిణీ
posted on Nov 2, 2024 11:04AM
చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి సందర్బంగా వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రతీ యేడు దీపావళిని పురస్కరించుకుని కాయిన్స్ పంచడం ఆనవాయితీగా వస్తోంది. కాయిన్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి వచ్చిన వెండి కానుకలతో వెండి కాయిన్స్ తయారు చేసి పంపిణీ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జిల్లాల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఈ వెండి కాయిన్ తీసుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. అమ్మవారి రూపంలో వెండి కాయిన్స్ ఉండటంతో భక్తులు ఎగబడి కాయిన్స్ తీసుకుంటున్నారు. కాగా ఈ యేడు వేసిన అయోధ్య సెట్ భక్తులను ఆకట్టుకుంటోంది.