ఎయిర్‌పోర్టా? కుక్కల దొడ్డా? రాజమౌళికి చేదు అనుభవం.. ఆగ్రహం..!
posted on Jul 2, 2021 1:57PM
విమానాశ్రయం అంటే ఎట్టా ఉండాలి? అంతర్జాతీయ ప్రయాణీకులు వచ్చే మార్గం ఇంకెట్టా ఉండాలి? అది దేశ రాజధానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఎంత గ్రాండ్‌గా ఉండాలి? మరి, మన దేశ పరువు పోయేలా.. అధ్వాహ్నంగా, చెండాలంగా ఉంటే ఎంత అవమానకరంగా ఉంటుంది? ఆ దుస్థితిని కళ్లారా చూసిన కళాదర్శకుడికి ఎంత చిరాకు తెప్పించి ఉంటుంది? ఇంకెంతం ఆగ్రహం కలిగించి ఉంటుంది? దేశం గర్వించదగిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి సరిగ్గా ఇలానే పరిస్థితే ఎదురైంది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రమంలో. అక్కడి పరిస్థితి చూసి ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఒళ్లు మండినా.. ఆ మంటను మనసులోనే దాచేసుకొని.. సుతిమెత్తగా ట్వీట్‌తో దేశం దృష్టికి తీసుకొచ్చారు. జక్కన్న చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు ఇండియాలో వైరల్‌గా మారింది.
"లుఫ్తాన్సా ప్లయిట్ ద్వారా ఎయిర్‌పోర్టులోకి వచ్చినప్పుడు ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్స్ కోసం ప్రయాణీకులకు పత్రాలను అందించారు. ఆ పేపర్స్ నింపడానికి ప్రయాణీకులు కొందరు నేలపై కూర్చుని ఉంటే మరికొందరు గోడపై పత్రాలు పూరిస్తున్నారు. టేబుల్స్‌ను ఏర్పాటు చేయడం అనేది చాలా సాధారణ సర్వీస్.. దాన్ని అందించాల్సింది. అలాగే వెలుపల ద్వారం వద్ద ఉండే హ్యాంగర్ దగ్గర వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు విదేశీయులకు మనదేశంపై కలిగే మొదటి అభిప్రాయం మరోలా ఉంటుంది. ఈ విషయంపై దృష్టి సారించండి..ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.