రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం
posted on Nov 24, 2024 5:29PM
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయసభల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆదాని పై అమెరికాలో కేసు నమోదు కావడంపై చర్చించాల్సింది కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేత ప్రమోద్ మహజన్ తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబర్ 20 వరకూ కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26న పార్లమెంటు సెషన్ జరగదు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంట్ సంయుక్త కమిటీ ఈ నెల 29న తన తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది.