శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ ఎటిజీహెచ్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (ఫిబ్రవరి 15) శ్రీవారిని మొత్తం 45వేల 825 మంది దర్శించుకున్నారు.

వారిలో 21 వేల 380 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల మూడు లక్షల రూపాయలు వచ్చింది.