కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏపై సెర్చ్ వారెంట్

కడన ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డి పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల విషయంలో యమా సీరియస్ గా ఉన్న పోలీసులు ఆ అసభ్య పోస్టులు పెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇండీసెంట్  పోస్టులతో చెలరేగిపోయిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ  రాఘవరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు. గత నాలుగు రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉండటంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు.

అంతే కాకుండా రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడని ప్రకటించి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడో ఇహనో ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతనిని విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగానే వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ కోసం పోలీసులు వేటాడుతున్నారు.  అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ నే తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన వర్రా  రవీందర్ రెడ్డి   విచారణలో తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వర్రా రాఘవరెడ్డిని అరెస్టు చేసి విచారిస్తే సోషల్ మీడియాలో ఇన్ డీసెంట్ల పోస్టుల వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు. వర్రా రవీందర్ రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోకేష్ లపైనే కాకుండా జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై కూడా అసభ్య పోస్టులు పెట్టిన సంగతి విదితమే.