Detective David Review: యూట్యూబ్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. డిటెక్టివ్ డేవిడ్ రివ్యూ!


ఇప్పుడు మనం మనకి తెలియని కర్ణుడి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామంటు మొదలయ్యే కథ ' డిటెక్టివ్ డేవిడ్'. ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఓటీటీలకి డబ్బులు చెల్లించని కొంతమంది తెలుగు సినిమా అభిమానుల కోసం యూట్యూబ్ లో కొన్ని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. అందులో టాప్-10 లో ఈ సినిమా ఒకటి అనేయొచ్చు. అంతలా ఈ సినిమాలో ఏం ఉందో ఓసారి చూసేద్దాం...

ఈ మూవీకి జావెద్ బాషా స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటుగా దర్శకత్వం వహించాడు. డి. నాగేశ్వరరావు, రామకృష్ణ చల్లా,  నిర్మాతగా వ్యవహరించగా.. వెంకట ప్రవీణ్ సినిమాటోగ్రఫీ అందించాడు. అసలు సినిమా కథేంటంటే.. డేవిడ్ చిన్నతనంలోనే తన నాన్న నుండి దూరంగా తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మ. ఇక తన గార్డియన్ గా ఓ అంకుల్ ఉంటాడు. డేవిడ్ కి ఓ వాచ్  అండ్ పజిల్ ఇచ్చి, దానిని సాల్వ్ చేయమని చెప్తాడు. అది రెండు నిమిషాల్లో సాల్వ్ చేస్తే ఒకే లేదంటే ఇంకేదో ఉందని అర్థమని డేవిడ్ కి చెప్తాడు. ఇక అతను సాల్వ్ చేస్తాడు. అలా రెగ్యులర్ గా అతనికి పజిల్స్ ఇవ్వడం తను సాల్వ్ చేయడం.. అలాగే ఇన్వెస్టిగేషన్ చేయడం నేర్చుకుంటాడు డేవిడ్. పోలీసు డిపార్ట్మెంట్ కి మర్డర్ మిస్టరీలలో డేవిడ్ సహాయం చేస్తుంటాడు. దాంతో ఆ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల నుండి డేవిడ్ కి  బెదిరింపులు వస్తాయి.

ఇక కొన్ని రోజులకి రాజేశ్ అనే వ్యక్తి చనిపోయాడని అతని కేసుని ఇన్వెస్టిగేషన్ చేయమని డేవిడ్ కి ఓ కేసు వస్తుంది. ఇక అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు డేవిడ్ కి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అసలు డేవిడ్ నాన్న ఎవరు? రాజేశ్ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డేవిడ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడనేది మిగతా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ బానే ఉన్నా  నిర్మాణ విలువలు అంతంత మాత్రమే ఉన్నాయి. అత్యధిక వీక్షకాధరణ పొందుతున్న ఈ మూవీ యూట్యూబ్ లో ఉంది .‌ఓ సారి చూసేయ్యండి.