కొన్ని యుగాల ముందే నేను పరిపాలించానంటున్న కళ్యాణ్ రామ్ 

కొంత మంది హీరోల ఆగమనం వల్ల తెలుగు సినిమా వైభవం పెరుగుతుంది. అలాంటి హీరోల్లో ఒకరు నందమూరి కళ్యాణ్ రామ్(kalyan ram)కెరీర్ మొదట్లో రెగ్యులర్ సినిమాలు చేసాడు. కానీ గత కొన్నేళ్ల నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల దృష్టి   తన వైపు మళ్లేలా  చేసుకుంటున్నాడు. ఆ మాటల్లో ఎలాంటి అక్షర దోషం లేదని తాజాగా నిరూపించాడు.

కళ్యాణ్ రామ్ హీరోగా 2022 లో వచ్చిన మూవీ బింబిసార(bimbisara)ఫాంటసీ థ్రిల్లర్‌ గా తెరకెక్కింది. బింబి సారుడు, దేవదత్తుడు అనే రెండు క్యారెక్టర్స్ లో కళ్యాణ్ రామ్ పండించిన పెర్ ఫార్మెన్స్ నభూతో న భవిష్యత్తు. పైగా తెలుగు సినిమా మర్చిపోతున్న  చారిత్రక నేపధ్యాన్ని కథావస్తువుగా ఎంచుకొని తనెంత స్పెషల్ హీరోనో కూడా  చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో నవ చరిత్రకి శ్రీకారం చుట్టాడు. బింబిసార కి సీక్వెల్ గా  బింబిసార 2 (bimbisara 2) ని ప్రకటించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా  ఒక క్రియేటివ్‌ కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించాడు. బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి  అంటూ ప్రీక్వెల్‌ని అనౌన్స్ చేసాడు.  దీంతో  నందమూరి అభిమానుల్లో జోష్ వచ్చినట్లయ్యింది.నిజానికి వాళ్లంతా ఈ న్యూస్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.  పార్ట్ 1 ని మించిన కథ పార్ట్ 2 లో ఉండబోతుందని తెలుస్తుంది.

 

 ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. గతంలో రొమాంటిక్‌ మూవీని తెరకెక్కించిన అనిల్‌ పాదూరి(anil paduri)దర్శకుడు కాగా  ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నే  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అత్యంత భారీ స్థాయిలో, అత్యంత ఉన్నతమైన సాంకేతిక పనితనంతో కనువిందు చేసే దృశ్యకావ్యంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.స్క్రీన్‌ మీద ఇప్పటి  ఎవరూ చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలో  షూటింగ్ కి వెళ్లనుంది.