ఆమాద్మీ నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నేర్చుకోవలసి ఉందా?

 

అన్ని అంచనాలను తారుమారు చేస్తూ ఆమాద్మీ పార్టీ ఏకంగా 66స్థానాలలో ఆధిక్యతలో దూసుకుపోతుంటే, బీజేపీ కేవలం 4 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణంగా సున్నాకు పడిపోయింది. ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులకు స్థానం ఉండబోదని సర్వేలు చెప్పిన మాట నిజం చేస్తూ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే స్వతంత్ర అభ్యర్ధి ఆధిక్యత కనబరుస్తున్నారు. అంతిమ ఫలితాలు వెలువడే సమయానికి ఆ అభ్యర్ధి కూడా ఆమాద్మీ పార్టీ ప్రభంజనానికి కనబడకుండా కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేసిన కిరణ్ బేడీ కూడా వెనుకంజలో ఉండటం విశేషం. సాంప్రదాయ పద్దతులలోనే ఎన్నికలను ఎదుర్కోవడానికి అలవాటుపడిన కాంగ్రెస్, బీజేపీలు ఇకనయినా ఈ ఎన్నికల ప్రచారంలో ఆమాద్మీ పార్టీ అనుసరించిన వ్యూహాలను లోతుగా అధ్యయనం చేసి వాటిని తాము కూడా ఇక ముందు రాబోయే ఎన్నికలలో అనుసరించడానికి వీలవుతుందేమో తెలుసుకొంటే మంచిది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu