మా డబ్బు మాకు కట్టండి:హోటల్ ముందు బ్యాంక్ సిబ్బంది ఆందోళన
posted on Jun 10, 2016 4:22PM
వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు టోపి పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా ఎఫెక్ట్‌తో దేశంలోని బ్యాంకులన్ని అలర్టయ్యాయి. పొగుబడుతున్న బకాయిలను వసూలు చేసుకోవడానికి పలు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. నగరంలోని మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ యాజమాన్యం హోటల్ నిర్మాణం, నిర్వాహణ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.118 కోట్లు అప్పుగా తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదాలు చెల్లించడం లేదు. బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా..స్పందించకపోవడంతో ఈ రోజు హోటల్ ముందు బ్యాంక్ సిబ్బంది ధర్నాకు దిగారు. ఎలాంటి నినాదాలు లేకుండా ఫ్లకార్డులతో ఆందోళన నిర్వహించారు.