జగన్, దాసరి భేటీపై సీపీఐ నారాయణ కామెంట్..
posted on Jan 9, 2016 9:41AM

వైసీపీ అధినేత జగన్..దాసరి నారాయణరావు భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారి భేటీపై సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణరావు జగన్ పై విమర్శలు చేశారు. పార్టీ సమావేశాల్లో భాగంగా గుంటూరు వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడుతూ జగన్ దాసరి కలవడమంటే జైలు పక్షులన్నీ ఒకే గూటికి చేరడమేనని ఆయన విమర్శించారు. అంతేకాదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని.. చంద్రబాబు చేస్తున్న తప్పులకు జగన్ ఊపిరి పోస్తున్నాడన్నారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్ తమ పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుతానని.. ఒకవేళ ఆంధ్ర నుండి పోటీ చేస్తే భీమవరం నుండి పోటీ చేస్తానని చెప్పిన సంగతి విదితమే.. దీని గురించి కూడా నారాయణ మాట్లాడుతూ కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. భీమవరం నుంచి పోటీ చేయడం వంటివి జరిగితే తన చెవి కోసుకుంటానని అన్నారు.