కాంగ్రెస్, ఎస్పీ పార్టీల పొత్తు... షీలా దీక్షిత్ ఔట్..

 

ఎట్టకేలకు సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరింది. ఇన్ని రోజులు రెండు పార్టీల మధ్య కుదురుతుందా..? లేదా..? అన్న సందేహాలకు తెరపడింది. రెండు పార్టీల మధ్య గత కొద్దికాలంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆఖరికి పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత గులాబ్ నబీ అజాద్ తెలిపారు. రానున్న ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌నున్న‌ట్లు కాంగ్రెస్ నేత గులామ్ న‌బీ ఆజాద్ తెలిపారు. అఖిలేశ్ నేతృత్వంలోనే కాంగ్రెస్‌-ఎస్పీ పార్టీలు పోటీ చేస్తాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పొత్తుకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆజాద్ చెప్పారు.

 

ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో ఉన్న షీలా దీక్షిత్ దీనిపై స్పందిస్తూ... రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇద్ద‌రు అభ్య‌ర్థులు సీఎంగా పోటీ చేయ‌లేర‌ని ఆమె అన్నారు. దాంతో సీఎం అభ్యర్థిగా పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె వెల్లడించారు.