షీనా బోరా హత్య కేసు.. ప్రత్యేక కోర్టులో చార్జిషీటు

 

షీనా బోరా హత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా ఆమె తల్లి పోలీసు విచారణలో ఉన్నసంగతి  తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలైంది. వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విచారణ మొదలవుతుంది. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా షీనా సోదరుడు మిఖాయిల్ బోరా మీద హత్యాయత్నం చేసిన నేరం మోపారు. తన సోదరి అదృశ్యం కావడం గురించి పదే పదే ప్రశ్నలు అడగడం వల్లే అతడిని చంపాలని ఇంద్రాణి భావించినట్లు సీబీఐ తెలిపింది. కాగా ఈ కేసులో నాలుగో నిందితుడైన శ్యామ్‌వర్ రాయ్ కూడా హత్యకు సహకరించినా, ఆ తర్వాత అతడు సీబీఐకి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే.