కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దుంపనాశనం

 

పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశంలో, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవసాయాన్ని నీరుగార్చిందనే విషయంలో కొన్ని ఉదాహరణలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు.

 

1. కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్ళపాటు ప్రభుత్వాలు నడిపిన కాంగ్రెస్ పాలకుల అశాస్త్రీయ విధానాల కారణంగా వ్యవసాయ పరిశోధనలు ఆగిపోయాయి. వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి.

 

2. బడ్జెట్‌లలో వ్యవసాయానికి ఎలాంటి కేటాయింపులు జరపకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

 

3. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం వెనుకబడి వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత వెనుకబడి వుంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వాలే.

 

4. ప్రభుత్వ వ్యవహారశైలి వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోయాయి.

 

5. భూసార పరీక్షలు, రైతు శిక్షణా తరగతుల వంటి వాటిని పూర్తిగా నిలిపేశారు. ఎరువల షాపులవాళ్ళు చెప్పినట్టుగా ఎరువులు, పురుగుమందులు ఉపయోగించే దురవస్థకు రైతులను చేర్చారు.