స్థానిక రైళ్ళ వ్యవస్థే పరిష్కారం..


విజయవాడలో ఇళ్ళ అద్దెలూ, స్థలాల ధరలూ ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఒక్క విజయవాడలోనే కాదు, తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని పట్టణాల్లో, నగరాల్లో ఇంటి అద్దెలు పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పల్లె సీమలను ఏ మాత్రం పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యం చేశారు. స్వగ్రామాల కంటే కూడా హైదరాబాదే ముద్దు అనుకున్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు! నగరాల్లో,పట్టణాల్లో ఒత్తిడి తగ్గాలంటే,ముంబై,చెన్నై,హైదరాబాద్ లలో మాదిరి స్థానిక రైళ్ళ వ్యవస్థలను అభివృద్ధి పరచుకోవాలి. అన్ని వర్గాల ప్రజలు గ్రామాలలోనే నివాసం ఉంటూ,తమ తమ పనులకు నగరాలకు వచ్చివెళ్ళేలా చౌకయిన రవాణాసదుపాయాలు కల్పిస్తే సమస్యకు  సరైన పరిష్కారం లభిస్తుంది. పాలకులు తమ పాలనా విధానాలు,ప్రణాళికలు జనబాహుళ్యానికి ఉపయోగపడేలా రూపొందిస్తే ఇలాంటి సమస్యలకు తావులేదు.ఈ మేరకు పాలకుల మైండ్ సెట్ మారాలి!

గరిమెళ్ళ రామకృష్ణ