జలాశయాల్లో ఇసుకను వినియోగించండి!


రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇసుక వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిప్పీన్స్ నుంచీ నౌకల ద్వారా ఇసుక దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇది పాలకుల హ్రస్వ దృష్టికి అద్దం పడుతున్నది. దేశంలో వివిధ నదులపై నిర్మించిన సాగునీటి జలాశయాల్లో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మీటలు వేసి నీటినిలవ, లభ్యతే క్లిష్టంగా మారింది.అలా ఏళ్ళ కొలది పేరుకొంటున్న ఇసుక గురించి పట్టించుకోకుండా మాఫియాలకు అవకాశం కల్పించటం, దిగుమతులు చేసుకోవటం సిగ్గుచేటు!ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబటులోకి వచ్చింది. అయినా ఆ దిశగా ఆలోచించరు. పరస్పర రాజకీయ విమర్శలు, రాజకీయ నాయకుల, అధికారుల మధ్య అనవసర సంఘర్షణలు పాలకుల వైఫల్యమే అని చెప్పక తప్పదు!అన్ని జలాశయాల నుంచి పూడికలు తీయించి వ్యాపార సరళిలో ఇసుకను విక్రయిస్తే, ఆ రాబడితో పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించవచ్చు, మరుగుదొడ్లనూ నిర్మించవచ్చు. ఇందుకు రాజకీయ సంకల్పం ముఖ్యం!

గరిమెళ్ళ రామకృష్ణ