చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యారా?
posted on Sep 2, 2015 12:39PM
.jpg)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిని ఎలా నిర్మించాలని.. దానిని ఎలా అభివృద్ధి చేయాలి.. అలాగే కేంద్ర నుండి ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా విషయంలో ఎలా నచ్చజెప్పాలని చూస్తుంటే ఇప్పుడు ఆపార్టీలో నేతలే ఆయనకు తలనొప్పిగా తయారయ్యారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాల్లో పార్టీ నేతల వల్ల ఆయనకు సమస్యలు వచ్చాయి.
అప్పుడు గోదావరి పుష్కరాలప్పుడు కూడా అలాగే జరిగింది. పుష్కరాలప్పుడు జరిగిన ప్రమాదంలో చాలా ప్రాణాలు మంది ప్రాణాలు పోగా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు మీద విమర్శలు చేశారు. దీని మీద నేషనల్ మీడియాలో జరిగిన ఇంటర్య్వూలో కూడా టీడీపీ నేతలు వారికి వచ్చీ రాని ఇంగ్లీష్ తో పాట్లు పడుతూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో నేతల భాషా పాండిత్యం పై మండిపడి ఇక నుండి ఇంగీష్ మీడియా మాట్లాడేందుకు గాను గల్లా జయదేవ్ ను నియమించారు.
అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏదో ఒక రకంగా పాట్లు పడుతుంటే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది ప్రజలు నిరాశపడొద్దు అని చెబుతుంటే ఈలోపు జేసీ దివాకర్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా రాదంటూ వ్యాఖ్యలు చేస్తాడు. రాష్ట్ర విభజన కారణంగా రాయలసీమకు ఎక్కువ నష్టం జరిగిందని.. విభజన అనంతరం ఇస్తున్న ప్యాకేజీలో రాయలసీమకు న్యాయం చేయాలని.. లేదంటే రాయలసీమలో పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షనేత జగన్ ప్రత్యేక హోదా కోసం టీడీపీ నేతలంతా రాజీనామా చేయాలని విమర్శిస్తే.. దానికి ఆయన ఎంపీ లంతా కాదు ఆఖరికి ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదంటూ బాంబు పేల్చారు.
మరోవైపు భూసేకరణలో కూడా చంద్రబాబుకు పార్టీ నేతలు సమస్యలు తెచ్చారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి భూసేకరణపై పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ అవసరం లేదని.. భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఏపీకీ ఎంత ప్యాకేజీ ఇస్తుందో తెలియదు కానీ ప్రత్యేక ప్యాకేజీలో రాయలసీమకు లక్ష కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చంద్రబాబుకు ఓరకంగా తలనొప్పి వ్యవహారమే అని చెప్పవచ్చు.
మరోవైపు మంత్రి నారాయణ అయితే ఏకంగా ఈ భూసేకరణ బిల్లు విషయం చంద్రబాబుకు తెలియదని.. చంద్రబాబు దృష్టికి తీసుకురాకుండానే భూసేకరణ బిల్లు ఇచ్చామని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. భూసేకరణ బిల్లుకు చంద్రబాబు మొదటి నుండి వ్యతిరేకమే అని కానీ రాజధాని నిర్మాణానికి సమయం దగ్గర పడుతుండటంతో తానే నోటిఫికేషన్ జారీ చేయించానని చెప్పారు. ఇది ఒకరకంగా ప్రతిపక్షనేతలకు విమర్శించే అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. మరి ఇప్పటికైనా చంద్రబాబు పార్టీనేతల వైఖరిని మార్చకపోతే చాలా కష్టమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.