చిరు అన్నయ్యకు చిక్ బళ్లాపూర్ లేనట్లే
posted on Mar 14, 2014 7:23AM
రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేసి నెగ్గడం కష్టమని, అందువల్ల కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ నుంచి బరిలోకి దిగాలని భావించిన కేంద్ర మంత్రి చిరంజీవికి చుక్కెదురైంది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ, మరో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకే కాంగ్రెస్ పార్టీ కేటాయించేసింది. దాంతో చిరంజీవి అన్నయ్య మరో స్థానం వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బెంగళూరుకు సమీపంలోని చిక్ బళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి చిరంజీవి బరిలోకి దిగుతారని ఇంతకుముందు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవి విజయం సాధించే అవకాశాలున్నందున ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ రెండో జాబితాతో వాటికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది.