తమిళ సర్కార్ పై సుప్రీంకోర్టు ఫైర్...
posted on Jul 7, 2017 5:56PM

తమిళనాడు ప్రభుత్వం పై సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయలు వేసంది. రైతులను రుణ విముక్తులను చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు తమిళనాడు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రైతుల ఆత్మహత్యలు నిలువరించడం ప్రభుత్వ బాధ్యత.. అంతేగానీ, వారు చనిపోయిన తర్వాత నష్టపరిహారం పంచడం కాదు’ అంటూ సుప్రీంకోర్టు తమిళనాడు సర్కారును గట్టిగా మందలించింది. రైతులను బ్యాంకులు వేధిస్తూ, అవమానిస్తుంటే ప్రభుత్వ పరంగా మీరేం చేస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక నుంచి రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆలోచన చేయబోమని, చర్యలు తీసుకోమని కోర్టు సాక్షిగా హామీ ఇవ్వాలని ఆదేశించింది.