విశాఖ చెవిలో చెవిరెడ్డి వెయ్యి కోట్ల పువ్వు!!

ఎక్కడ రాయలసీమలోని చంద్రగిరి.. ఎక్కడ విశాఖపట్నం. చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు. జగన్ ఆశీస్సులతో రాష్ట్రమంతటా రెచ్చిపోతున్న దండుపాళెం బ్యాచ్‌లో ముఖ్య సభ్యుడైన చెవిరెడ్డి, అడ్డగోలుగా సంపాదించడంలో ఆరితేరాడు. తనకెవరైనాఅడ్డు వస్తే భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడడు. నిన్నగాక మొన్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిని హత్య చేయడానికి చెవిరెడ్డి చేసినప్రయత్నాలు చూశాం. ఇప్పుడు వైజాగ్‌లో చట్టాలు, నిబంధనల చెవుల్లో పూలు పెట్టి, ఆయనగారు  చేసిన వెయ్యి కోట్ల స్కామ్ వివరాలేంటో చూద్దాం. 

చెవిరెడ్డి చేసేవన్నీ నేరాలు, మోసాలు. పైకి బిల్డప్పు మాత్రం పరమభక్త శిఖామణిలా వుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దండుపాళెం బ్యాచ్‌లో కీలక మెంబర్ అనే విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం. తనకు ఎంతమాత్రం సంబంధంలేని విశాఖలో మకాం వేసి ఏకంగా వెయ్యికోట్లకు పైగా నొక్కేశాడు. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌ను హిందువులు వ్యతిరేకించకుండా చెవిరెడ్డి మంచి ప్లాన్ వేశారు. ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి, దేవాలయ సెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేసేశారు. 

ఋషికొండ విధ్వంసకారుడు చెవిరెడ్డి

బినామీలతో  ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్‌తో  వందల కోట్లు సంపాదించారు. ఋషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సి.ఆర్.జెడ్. ప్రాంతంలో డంప్ చేయించిన చెవిరెడ్డి అక్కడి ఎర్ర మట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారు. ముఖ్యమంత్రి జగన్‌కి గంగవరం పోర్టు అధినేత సన్నిహితులు కావడంతో, పోర్ట్.లోని మట్టిని విక్రయించడానికి చెవిరెడ్డి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు. ఆ కారణంగానే ఋషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి  అమ్ముకున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్టులో అదానీ నిర్మిస్తున్న బెర్తులు, ఇతర అవసరాల కోసం వందల కోట్ల విలువైన ఈ మట్టిని తరలించి అమ్ముకొని సొమ్ముచేసుకున్నారు.

పెందుర్తి నియోజకవర్గంలో భారీ స్కాం

పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో 200 ఎకరాల్లో క్వారియింగ్ చేసి వందల కోట్లు చెవిరెడ్డి సంపాదించారు. ప్రభుత్వం పరిశ్రమలకని కేటాయించిన ఈ భూమిలో చాలా తెలివిగా మైనింగ్ చేశారు. ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కాదని ప్రభుత్వ అధికారులతోనే సర్టిఫై చేయించి తన మైనింగ్ అవసరాలకు వాడుకున్నారు. కేవలం మైనింగ్ చేసేందుకే ఈ భూమిని పరిశ్రమలకు పనికి రాదని పలుకుబడితో సర్టిఫై చేయించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉండగా ఈ భూములకు నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అనే సర్టిఫికెట్ మంజూరు చేయించి దాని ఆధారంగా ఆ భూముల్లో మైనింగ్ చేసి  సొమ్ము చేసుకున్నారు.

బక్కన్నపాలెంలో 208 కోట్ల టిడిఆర్

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో  తాను చేస్తున్న సర్వేలకు డబ్బు కావాలంటూ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2లో 208 కోట్ల టిడిఆర్ బాండ్లను తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో దక్కించుకున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం చెవిరెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టి.డి.ఆర్ బాండ్లు మంజూరు చేశారు. ఇది అక్రమమంటూ ఫిర్యాదుల వెళ్లినా, తమకూ తెలిసినా తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడికి తలొగ్గారు. 

ఫార్మాసిటీలో డంపుల వ్యాపారం

పరవాడలోని ఫార్మాసిటీలో పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి, భయపెట్టి రసాయన వ్యర్ధాల డంపులను చెవిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ద్వారా ఈ డంపులతో ఎంచక్కా వ్యాపారం చేసుకొంటున్నారు. ఈ కారణంగానే  ఫార్మీ సిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు ధైర్యంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఒక 20 రోజుల ఆగితే, ఎన్డీయే గవర్నమెంట్ వచ్చాక చెవిరెడ్డికి భారీ సత్కారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.