విమానాశ్రయాల్లో ఉత్తుత్తి బాంబు కారకుడు పుస్తక రచయిత

ఇటీవలికాలంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ వియానాశ్రయంలో  ఏకంగా ఆరు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ సిబ్బందికి ఎదురయ్యాయి. ఇంకే తనిఖీలు మమ్మురం చేశారు. దేశంలో  వివిధ  విమానయాన సంస్థలు నడుస్తున్నాయి. నిన్న మంగళవారం  ఒక్కరోజే 100 కి పైగా విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సరిగ్గా పక్షం రోజుల్లో 510 కి పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఏ తీవ్రవాదో బెదిరిస్తున్నాడని భధ్రతా సిబ్బంది అనుమానించారు. ఒక రచయిత ఈ బెదిరింపులకు పాల్పడినట్టు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదంపై పలు పుస్తకాలు రచించిన జగదీష్ అని వెల్లడైంది. ఇతనికి గతంలో నేరచరిత్రఉంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బెదిరింపు కాల్స్ ను సీరియస్ గా తీసుకున్నారు. కేసులు నమోదుచేయడంతో బాటు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నవారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే  ఏవియేషన్ చట్టాలను సవరిస్తామన్నారు.