రౌడీలకు చంద్రబాబు వార్నింగ్.. తాట తీస్తా..
posted on Oct 14, 2017 12:46PM

ఏపీ సీఎం ముఖ్యమంత్రి అధికారులు సరిగ్గా పని చేయకపోతే వారికి క్లాసుల మీద క్లాసులు పీకుతూనే ఉంటారన్న సంగతి తెలిసిందే. అందుకే బాబుకు అధికారులు వణికిపోతుంటారు. ఇక అవినీతి నిర్మూలనకు కూడా చంద్రబాబు కంకణం కట్టారు. ఇప్పుడు తాజాగా..మరో వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. విజయవాడ అంటేనే రౌడీయిజంకు కేరాఫ్ అడ్రస్ అని అందరికి తెలుసు. దీనిపై ఆయన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విజయవాడలోని వాంబే కాలనీలో ఈరోజు చంద్రబాబు పర్యటించిన ఆయన మాట్లాడుతూ....విజయవాడలో రౌడీ అనేవాడే కనపడకూడదని... నగరంలోని రౌడీల తాట తీస్తానని ఆయన హెచ్చరించారు. రౌడీయిజం అనే మాట కూడా వినిపించకూడదని అన్నారు. రౌడీయిజం చేసేవారిని నగరం నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. వాంబే కాలనీలో తక్షణమే పెట్రోలింగ్ పెంచాలని పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.