అభిమానులకు షాకిచ్చిన పవన్...
posted on Oct 14, 2017 3:21PM
.jpg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రత్యక్షబరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుండే ఆ ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు పార్టీ కార్యలయంపై పవన్ అభిమానులకు షాకిచ్చినట్టు తెలుస్తోంది. తాను పుట్టిన ఊరిలోనే పార్టీ కార్యాలయాన్నిపెడుతున్నా … అక్కడ పార్టీ ఆపీసు చుడాలాంటూ పవన్ ఈ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పవన్ అలా ప్రకటించాడో..?లేదో..? అభిమానుల్లోనూ.. కార్యకర్తల్లోనూ .. ఒకటే హడావుడి. అయితే ఇప్పుడు వారికి షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ లోనే రాష్ట్ర కార్యాలయం అంటూ తాజాగా ప్రకటించాడు. ఇప్పట్లో ఏపీలో స్థాపించే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కు లేదట. త్వరలో ప్రజాయాత్రని చేపట్టాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్లుగా ప్రచారం కోసం పార్టీ ఐటి విభాగాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. దీంతో పవన్ అభిమానులు కాస్త నిరాశచెందినా... హైదరాబాద్ లోనే పార్టీ హెడ్ క్వార్టర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా... పవన్ ఏపీకి వస్తాడని ఎన్నో ఆశలతో ఉన్న ఏపీ జనసేన అభిమానుల సందడి దీపావళికి ముందే తుస్సుమంది . పార్టీ ఆఫీస్ ఎక్కడ పెడితే ఏంటని మరి కొందరు సర్దుకుంటున్నా ఎపుడూ ఏ విషయం మీదా పవన్ కు క్లారిటీ ఉండదు అనడానికి ఇదే ఉదాహరణ అంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.